టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి ఊహించని షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీని వీడి… వైసీపీ లేదా.. జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1వ తేదీన గంటా పుట్టిన రోజున వేడుకల తర్వాత తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ మార్పు విషయాన్ని తన సన్నిహితులతో చర్చిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో సన్నిహిత సంబంధాలు కలిగిన గంటా ఆయనతో కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి అపాయింట్మెంట్ కోరారు. చిరంజీవితో కూడా పూర్తిస్తాయిలో చర్చించిన తర్వాతే గంటా శ్రీనివాస్ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో గంటా శ్రీనివాస రావు భేటీ అయ్యారు. పలు విషయాలపై చర్చించారు. జనసేనలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ కొన్ని రోజుల్లే సమీకరణాలు మారిపోయాయి. వైసీపీలో చేరేతేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని గ్రహించిన గంటా తదనుగుణంగా పావులు కదుపుతున్నారు.