సూడాన్‌లో బాంబు దాడుల ఘటనల్లో వందలాది మంది మరణించినట్లు మానవ హక్కుల కార్యకర్తలు వెల్లడించారు. తిరుగుబాటుదారులు వేసిన బారెల్ బాంబులు, షెల్లింగ్ కారణంగా గత రెండు రోజుల్లోనే దాదాపు 127 మంది చనిపోయినట్లు తెలిపారు. 20 నెలలుగా ఆర్మీ, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(RSF) మధ్య కొనసాగుతున్న ఆధిపత్య యుద్ధంలో సాధారణ ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.