BPT: పెరవలి గ్రామంలో దండే శ్రీనివాసరావుకు చెందిన మోటార్ షెడ్డును బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. పాకలో ఉన్న 3 మోటార్లు, ఒక ఆయిల్ ఇంజన్ పూర్తిగా కాలిపోయాయి. ఘటనలో సుమారు రూ.1లక్ష 50 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ఇది రాజకీయ ప్రత్యర్థుల దుశ్చర్యగా బాధితుడు భావిస్తున్నాడు. దీనిపై వేమూరు పోలీసులకు ఫిర్యాదు చేసాడు.