ఐరోపా నార్వేలో ఓ డాక్టర్ 87 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వారిలో ఇద్దరు మైనర్ బాలికలు ఉన్నారు. ఈ కేసును నార్వే చరిత్రలోనే అతిపెద్ద లైంగిక వేధింపుల కుంభకోణంగా అభివర్ణిస్తున్నారు. 55 ఏళ్ల ఆర్నే బై.. 20 ఏళ్లుగా మహిళలపై అత్యాచారం చేస్తున్నాడు. ఓ మహిళ తనకు జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లింది. దీంతో ఆ కీచక డాక్టర్ బుద్ది బయటపడింది. కోర్టు నిందితుడికి 21 ఏళ్లు జైలు శిక్ష విధించింది.