రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాజధాని వికేంద్రీకరణపై ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. రాజధాని విషయంలో చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి, శాసనసభకు లేదంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సర్కారు సుప్రీం కోర్టులో సవాలు చేసింది. చట్టాలు చేయడంలో శాసనసభ అధికారాలను కోర్టులు నిర్ణయించలేవని రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో ప్రశ్నించింది.
అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ హైకోర్టులో సవాలు చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు తీర్పు శాసనవ్యవస్థను నిర్వీర్యం చేయడమేనన్న ఏపీ సర్కార్ అభిప్రాయపడింది. రాజధాని వికేంద్రీకరణపై గతంలో హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని కోరిన ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ హైకోర్టు సూచించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టాలు చేయడానికి శాసనసభకు ఉన్న అధికారాలను హైకోర్టు ప్రశ్నించలేదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు శాసనాలు చేయకుండా న్యాయస్థానాలు నిరోధించలేవని ప్రభుత్వం వాదిస్తోంది.
మూడు రాజధానుల విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. సిఆర్డీఏ చట్టం రద్దుతో పాటు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టడంపై ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కోర్టు వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిపాదిత బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ హైకోర్టుకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఉపసంహరించుకున్న తర్వాత ఏపీ హైకోర్టు రాజధాని తరలింపుపై శాసన అధికారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేవంటూ తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంపై కొద్ది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటోంది.