రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామంలో ట్రాక్టర్ పల్టీ కొట్టి రైతు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దగోని నర్సింహా (54) తుమ్మలగూడెం గ్రామ శివారులోని కాటేపల్లి మహేశ్ పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఇంజన్ పైకి లేవడంతో రైతు నాగలి మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.