»A Monkey Who Comes Everyday To Bow Down At The God Temple
Monkey visits temple: ప్రతిరోజు శివుడి దర్శనానికి వచ్చే కోతి, ఆ భక్తికి ఆశ్చర్యపోతారు…
మనం ప్రతి రోజు లేదా వారానికి ఒక రోజు దగ్గరలోని గుడికి దర్శనం కోసం వెళ్తుంటాం. చాలామంది వారానికి ఒకసారి గుడికి వెళ్తుంటారు. రోజూ వెళ్లే వారు కూడా ఉంటారు.. మనం ప్రతి రోజు గుడికి వెళ్లి, దేవుడిని దర్శించుకోవడం ఎప్పుడూ చూసేదే. కానీ ఓ కోతికి సంబంధించిన వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఆ కోతి ప్రతి రోజు దేవుడి దర్శనం కోసం వెళ్లడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో కనిపిస్తోంది.

ఓ కోతి ప్రతి రోజు సమీపంలోని శివాలయానికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటోంది. అదే గుడిలోని ఇతర దేవుళ్లకు కూడా నమస్కరిస్తోంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం ఆ కోతి క్రమం తప్పకుండా రోజు ఆ గుడికి వచ్చి, దండం పెట్టుకొని వెళ్తోంది. ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో కోతి నడుచుకుంటూ గుడికి రావడం, మెట్లు ఎక్కి, అక్కడి పరుశ రాముడికి దండం పెట్టుకోవడం, ఆ తర్వాత శివుడి వద్దకు వెళ్లి పడుకొని, మరీ నమస్కరించినట్లుగా కనిపిస్తోంది.