KNR: మానకొండూరు మండలం శంషాబాద్ స్టేజి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గ్రామస్థుల వివరాలు.. ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టడంతో శంకరపట్నం మండలం చింతగట్టు గ్రామానికి చెందిన మల్లారెడ్డి (52) మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.