ASR: హుకుంపేట మండలం రాళ్లగడ్డ వద్ద సోమవారం ఉదయం సుమారు 3.15 గంటల సమయంలో అరకు నుంచి పాడేరు వెళ్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం కారుపై కూలినా, అందులోని వారు వెంటనే బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. చీకటి వల్లే ప్రమాదం జరిగిందని, ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.