5 Naxals killed:భద్రతా దళాల కాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతి
జార్ఖండ్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఐదుగురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మావోయిస్ట కీలక నేతలు ఉన్నారు. వీరి తలపై రూ.25 లక్షల చొప్పున రికార్డు ఉంది.
5 Naxals killed:జార్ఖండ్లో పోలీసులకు (police) మావోయిస్టులకు (naxals) మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. ఇద్దరు మావోయిస్ట కీలక నేతలు చనిపోయారు. ఛాత్రా జిల్లా పాలమూ సరిహద్దులో గల లావలాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరిగాయి. ఈ పోలీసు స్టేషన్ రాజధాని రాంచీకి (ranchi) 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాల్పుల తర్వాత సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించిందని… సీజ్ చేశామని ఛాత్రా ఎస్పీ రాకేశ్ రంజన్ తెలిపారు.
గౌతమ్ పాశ్వాన్ (gautham), కార్లీ (carli) తలపై రూ.25 లక్షల రికార్డు ఉందని ఎస్పీ రాకేశ్ రంజన్ (rakesh ranjan) చెప్పారు. వీరిద్దరూ ఎస్ఏసీ సభ్యులు అని పేర్కొన్నారు. నందు, అమర్ గంజు, సంజీవ్ భుయాన్ సబ్ జోనాల్ కమాండర్లు అని వివరించారు. వీరి తలపై రూ.5 లక్షల చొప్పున రికార్డు ఉంది. అక్కడ నుంచి ఏకే 47, ఇన్సాస్ రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.కడపటి సమాచారం అందేవరకు ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.