KKD: గొల్లప్రోలు, తాటిపర్తి, చెందుర్తి, కొడవలి గ్రామాల్లో కోడిపందేలు, గుండాటలపై బుధవారం దాడులు చేసి జూదం ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. అరెస్ట్ చేసిన వారి నుంచి నాలుగు కోడిపుంజులు, నాలుగు కోడికత్తులు, రూ.4,230 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వారిపై కేసులు నమోదుచేశామన్నారు.