NZB: మహిళను వేధిస్తున్న ఒకరిని షీ టీం సభ్యులు పట్టుకున్నారు. ఓ మహిళ ఫోన్‌కి ఒక వ్యక్తి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ.. అసభ్యకర సందేశాలను పంపుతూ ఆమెను వేధిస్తున్నాడు. దీంతో సదరు మహిళ షీటీంకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వెంటనే ఆర్మూర్ షీటీం సభ్యులు అతడిని పట్టుకున్నారు. తదుపరి చర్యలకై అతడిని ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.