Rains at Bengalure:ఐటీ హబ్ బెంగళూరులో (Bengalure) భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. నగర శివారులో గల దేవనహళ్లిలో (Devanahalli) వాతావరణం అనుకూలంగా లేదు. ఇక్కడే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (Kempegowda International Airport) ఉన్న సంగతి తెలిసిందే. దీంతో 14 విమానాలను (14 flights) మళ్లించారు. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 6 విమానాలు ఆలస్యంగా బయల్దేరనున్నాయి.
సాయంత్రం 4.05 గంటల నుంచి 4.51 గంటల వరకు వాతావరణం బాగోలేదని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. బలమైన గాలులు వీచాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిందని.. దీంతో ప్లైట్ ఆపరేషన్స్‌కు (flight operations) అంతరాయం కలిగిందని పేర్కొన్నారు.
14 విమానాలను మళ్లించారు.. 12 ఫ్లైట్స్ చెన్నై, ఒకటి కోయంబత్తూర్, మరొకటి హైదరాబాద్ మళ్లించారు. ఏడు ఇండిగో విమానాలు.. మూడు విస్తారా, రెండు ఆకాశ, గో ఎయిర్, ఎయిర్ ఇండియాకు చెందిన ఒక్కో విమానం ఉంది. ఆ తర్వాత మరో అధికారి మాట్లాడుతూ.. చెన్నైకి వెళ్లిన విమానాల్లో ఇంధనం నింపుతున్నారని.. అవీ కాసేపట్లో బెంగళూరు వస్తాయని తెలిపారు. ఎయిర్ పోర్టులో సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు.
కెంపెగౌడలో 45.2 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం వల్ల క్యాజువల్ ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలిగింది. సిటీ సెంటర్లో మాత్రం ఎలాంటి వర్షం లేదని వాతావరణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.