లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 200 మంది చిన్నారులు మరణించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. లెబనాన్‌లో గత రెండు నెలలుగా ప్రతిరోజూ సగటున ముగ్గురు పిల్లలు చంపబడ్డారని UNICEF ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ ప్రకటించారు.