SKLM: రాజాం మున్సిపల్ కార్యాలయం వెలుపలి ప్రాంగణంలో శుక్రవారం మున్సిపల్ కార్మికులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికుల యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్.రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం దశల వారీ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్మికుల సంఖ్య పెంచాలని, పనిముట్లు అందించాలని అన్నారు.