విజయనగరం: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం విజయనగరం శ్రీ పైడితల్లమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు పోటెత్తారు. సిరిమాను మహోత్సవం ముగిసిన నేపథ్యంలో మొదటి మంగళవారం కావడంతో అమ్మవారిని దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. కాగా నేడు సాయంత్రం అమ్మవారి తెప్పోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.