BPT: వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనందబాబును ఆయన నివాసంలో శుక్రవారం మహాసేన రాజేష్, సీనియర్ దళిత నాయకుడు దళిత రత్న డాక్టర్ చార్వాక మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలోని దళితులు అభివృద్ధి గురించి చర్చించారు. దళితుల సంక్షేమానికి రావలసిన నిధులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్య తదితర అంశాల గురించి ఎమ్మెల్యేతో చర్చించారు.