VSP: విశాఖ డెయిరీ అరిలోవలో 7.95 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని రెవెన్యూ శాఖకు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం భీమిలి ఆర్డీవో స్పందించారు. విశాఖ డెయిరీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఆ భూమికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లతో వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.