KRNL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు విద్యార్థులు ముందుకు రావాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న శుక్రవారం పిలుపునిచ్చారు. నవంబర్ 12,13వ తేదీలలో ఆదోనిలో జరిగే ఏఐఎస్ఎఫ్ 30వ సభలను జయప్రదం చేయాలని పేర్కొన్నారు. విద్యా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ఏకైక విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అన్నారు.