VSP: గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం అని విశాఖ ఎంపీ భరత్ అన్నారు. గురువారం విశాఖ కళాభారతిలో వీరేశిలింగం పంతులుపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు ఎంపీ భరత్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాభారతి నిర్వాహకులు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.