ALR: చింతపల్లి మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆంధ్ర కాశ్మీర్ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు శుక్రవారం ఉదయం లంబసింగికి భారీగా పర్యాటకులు తరలివచ్చారు. లంబసింగి, తాజంగి జలాశయం, చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు.