VSP: విశాఖలోని ఎండాడ జంక్షన్ వద్ద రోడ్డు పక్కన గురువారం సాయంత్రం జింకల గుంపు కనిపించింది. జింక పిల్లలను చూసి స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి పక్కనే అవి ఆహారం తింటూ కనిపించాయి. రోడ్డుపైకి వస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని.. వాటి రక్షణకు చర్యటు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.