సత్యసాయి: భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని గురువారం జిల్లా కలెక్టర్ చేతన్‌ను ధర్మవరం నియోజక వర్గ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల స్థలాలకు భూములు ఇచ్చిన తుంపర్తి రైతులకు ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదు, పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.