BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలో సోమవారం 30వ ఉర్సు గంధం మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దర్గ కమిటీ సభ్యులు ఆదివారం తెలియజేశారు. మంగళవారం గంధం ఊరేగింపు, ఖురాన్ బోధించుట, అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయని పేర్కొన్నారు. కావున కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.