NLR: గూడూరు వీరభద్ర స్వామి ఆలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం దివ్యాంగులకు నూతన దుస్తులు, స్వీట్లు, టపాకాయలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెడ్ సంస్థ దివ్యాంగులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, రెడ్ సంస్థ అభివృద్ధి కోసం పార్టీ తరపున రూ.లక్ష అందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.