ASR: గూడెం కొత్తవీధి మండలం గరికబంధ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన అటవీ కలప పట్టుబడిందని పెదవలస అటవీ రేంజ్ అధికారిణి శివరంజని గురువారం రాత్రి తెలిపారు. తమ సిబ్బందితో సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, సుమారు రూ.12వేల విలువ చేసే 14 బూషి దుంగలు పట్టుబడ్డాయని అన్నారు. ఈమేరకు వాటిని స్వాధీనం చేసుకుని, కాకరపాడు అటవీ డిపోకు తరలించామని తెలిపారు.