NLR: ఏపీలో దాదాపు రూ.1397 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే వివిధ స్టేషన్లు అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు స్టేషన్ను రూ.102 కోట్లతో ఆధునీకీకరించనున్నారు. అంతర్జాతీయ హంగులతో దీనిని తీర్చిదిద్దనున్నారు. సంబంధిత పనులకు ప్రధాని మోదీ ఇటీవల వర్చువల్గా శంకుస్థాపన చేయడంతో జోరుగా పనులు జరుగుతున్నాయి.