అన్నమయ్య: దీపావళి బాణాసంచా తయారీ కేంద్రాలు, నిల్వ గోడౌన్స్, దుకాణాలకు ప్రభుత్వ అనుమతి ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ హెచ్చరించారు. ఈ నెల 31వ తేదీ వైభవంగా జరగనున్న దీపావళిని దృష్టిలో ఉంచుకొని.. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకోవాలన్నారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించాలన్నారు.