అల్లూరి: నూతన మద్యం పాలసీలో భాగంగా జీకేవీధి మండలం సీలేరులో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలలో ఇచ్చిన లైసెన్స్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సీలేరు ఎస్సై రామకృష్ణ శుక్రవారం అన్నారు. నిబంధనలు పాటించకుంటే లైసెన్స్ రద్దుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసినట్లు అయితే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామన్నారు.