కడప: ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో బుధవారం వైసీపీ నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రధాని ఫసల్ బీమా యోజన ప్రీమియంను గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతాంగం పక్షాన చెల్లించిందని, కానీ కూటమి ప్రభుత్వం ఖరీఫ్‌లో చెల్లించలేదని రబీలో రైతులే చెల్లించాలని ఆదేశించడం రైతాంగాన్ని వంచించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.