KDP: జమ్మలమడుగులోని CSI క్యాంబెల్ ఆసుపత్రి నర్సింగ్ కళాశాల హాస్టల్లో నర్సింగ్ ట్రైనింగ్ విద్యార్థులకు గత 2 రోజుల నుంచి యాజమాన్యం భోజనం పెట్టలేదంటూ గురువారం రాత్రి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు మాట్లాడుతూ.. కొంతమంది 2 నెలల ఫీజు రూ.3500 చెల్లించలేదంటూ 2 రోజులుగా భోజనం పెట్టలేదు. కొందరు విద్యార్థులు కళ్ళు తిరిగి కింద పడిపోయినట్లు తెలిపారు.