విజయనగరం: గ్రామాల్లో ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేయాలని నెల్లిమర్ల ఎంపీడీవో రామకృష్ణరాజు ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో రక్షిత మంచినీరు అందించాలన్నారు. గ్రామాల్లో నిత్యం అందుబాటులో ఉండాలన్నారు.