EG: రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ మంగళవారం జిల్లాలో రెండు చోట్ల స్టీల్ హబ్స్ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి సుధాకర్ సోమవారం తెలిపారు. కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజానగరం మండల పరిషత్ కార్యాలయంలో ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు.