PLD: నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచి విహారయాత్ర శనివారం పున: ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. రెండ్రోజులపాటు జరిగే ఈ ప్రయాణానికి పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. సాగర్ నుండి శ్రీశైలానికి వెళ్లి తిరిగి వచ్చేందుకు పెద్దలకు రూ.3 వేలు, పిల్లలకు రూ.2400గా నిర్ణయించారు.