SKLM: బూర్జ మండలం తోటవాడ గ్రామపంచాయతీలో మరమ్మత్తులకు గురైన ఎల్ఈడీ విద్యుత్ వీధి దీపాలను సంబంధిత సిబ్బంది గురువారం తొలగించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ సూర ఆనందరావు ఆధ్వర్యంలో నూతన ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్తీక మాసం ప్రారంభం కానుండడంతో.. గ్రామస్తులు దేవాలయాలకు వెళ్లేందుకు వేకువజామున ఇబ్బంది లేకుండా ఈ పనులు చేపట్టామన్నారు.