VZM: గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ మేరకు మంగళవారం సాలూరులో గిరిజనశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం విడుదల చేసే డీఎస్సీలో తమ పోస్టులు మినహాయించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని యూనియన్ నాయకులు తెలిపారు.