SKLM: రణస్థలం మండలంలోని నారువ, బోయపాలెం గ్రామాలకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు మంగళవారం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎంపీ అప్పలనాయుడు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ పాలన నచ్చే పార్టీలోకి చేరామని వారు తెలిపారు.