NLR: బుచ్చి పట్టణంలో ఉన్న పందుల పెంపకదారులకు నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మలిదేవి కాలువ కట్టపై తాత్కాలిక స్థలాన్ని కేటాయించారు. స్థలాలు వచ్చిన వారు ఆ స్థలానికి వెళ్లాలని, లేని వారికి కట్టపై స్థలాలు కేటాయించామని తెలిపారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పందుల పెంపక దారులు జీవన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.