GNTR: పొన్నూరు పట్టణంలోని సెయింట్ థామస్ ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు షటిల్ బ్యాట్మెంటన్ అండర్ 14 స్కూల్ గేమ్స్ పోటీలలో మండల స్థాయిలో విజేతలుగా నిలిచారు. వీరు రేపు జరగబోయే జిల్లా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ మేరీ థామస్ మీడియాకు తెలిపారు. 8వ తరగతి సాహితి, 7వ తరగతి ఖుషిసింగ్ విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించింది.