ప్రకాశం: జిల్లా విద్యాశాఖ అధికారి డి సుభద్ర గురువారం బదిలీ అయ్యారు. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. అమరావతిలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో హయాంలో చేపట్టిన సిఫారసు బదిలీలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల విజయవాడ వరద బాధితులకు సేకరించిన విరాళాలు పక్కదారి పట్టాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై విచారణ కూడా జరిగింది.