NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రాఘవరెడ్డి కాలనీ వద్ద ఉన్న చేపల వ్యాపారస్తులు ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా తాము వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే నగర పంచాయతీ అధికారులు ఇక్కడ విక్రయాలు చేయకూడదు అనడం ఏమిటని ప్రశ్నించారు. తాము నగర పంచాయతీకి రుసుము చెల్లిస్తున్నామని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.