VZM: గ్రామాలలో సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి వెల్లడించారు. భోగాపురం మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనూష అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు హాజరయ్యారు. సమావేశంలో 2024-25 సవరణ బడ్జెట్, 2025-26 అంచనా బడ్జెట్‌ని ప్రజా ప్రతినిధులు ఆమోదం తెలిపారు.