SKLM: మౌలిక వసతులు కల్పన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శనివారం పలాస మండలం రెంటికోట కాలనీ వద్ద పలాస గొప్పిలి రోడ్డు రిపేర్ పనులను ప్రారంభించారు. రూ.10 లక్షల నిధులతో పనులు జరగనున్నట్లు తెలిపారు. గుంతలు లేని రోడ్లు సాధనగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని కొనియాడారు.