ప్రకాశం: కొనకనమిట్ల మండలం ఎంపీడీవోగా ఈశ్వరమ్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎంపీడీవో శ్రీనివాసులు సాధారణ బదిలీలలో భాగంగా ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని ఆమె పేర్కొన్నారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.