కృష్ణా: కూటమి ప్రభుత్వం పేదల పెన్నిధి ప్రభుత్వమని సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపుగా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. శుక్రవారం NTR భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం చర్చ్ రోడ్డు, పాపరాజు వీధి, బుడమేరు మధ్య కట్ట, విజయ దుర్గానగర్లో అర్హులైన వారికి ఇంటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు.