VZM: ఏఐటీయూసీ 105వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం విజయనగరం డి.ఎన్.ఆర్ అమర్ భవన్ మీద ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఏఐటీయూసీ జెండాలను ఎగురవేసి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ.. భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర కార్మిక సంఘం 1920 అక్టోబర్ 31న దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబాయి నగరంలో ఆవిర్భవించిందన్నారు.