KDP: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి భాస్కర్ మైదుకూరు పట్టణ పరిధిలోని ఉల్లి రైతులను కలవడం జరిగింది. క్వింటాల్ 1,000 రూపాయలకు కొనే నాధుడు లేక చాలా అద్వాన్న పరిస్థితులు ఎదుర్కొంటున్నామని తమ ఆవేదనను వెలిబుచ్చారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విదేశీ ఎక్స్పోర్ట్ నిషేధాన్ని వెంటనే ఎత్తి వేయించాలని కోరారు.