ATP: జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వైసీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక పట్టణంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో కొన్ని మండలాలనే కరువు మండలాలకు ప్రకటించడం సబబు కాదని అన్నారు. అతివృష్టి, అనావృష్టితో జిల్లాలోని అన్ని మండలాల రైతులు నష్టపోయారన్నారు.