ASR: గుంటూరులో జరిగిన సౌత్ జోన్ జూ. జాతీయ స్ధాయి పోటీలలో 200, 400 మీటర్స్ రన్లో బంగారు పతకాలు సాధించి, భువనేశ్వర్‌లో జరిగే జాతీయ స్ధాయి పోటీలకు ఎంపికైన లోహిత్‌ను అరకు ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చలపతిరావు సత్కరించారు. ఈ మేరకు లోహిత్‌ను శాలువాతో సత్కరించి, నగదును బహుమతిగా అందించారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.