»Relief For Chandrababu Permission To Participate In Political Activities And Rallies
Chandrababu: చంద్రబాబుకు ఊరట.. రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీలో పాల్గొనడానికి అనుమతి
సుప్రీం కోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ స్కామ్ కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌పై నేడు విచారణ జరగ్గా సుప్రీం విచారణను డిసెంబర్ 8వ తేదికి వాయిదా వేసింది. బాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి సుప్రీం అనుమతులు ఇచ్చింది.
ఏపీ సీఐడీ (Ap CID)కి సుప్రీం కోర్టు షాకిచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill developement scam case)లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బాబు బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ వేసింది. తాజాగా ఆ పిటీషన్‌పై విచారించిన సుప్రీం డిసెంబర్ 8వ తేదిక విచారణను వాయిదా వేసింది. అలాగే చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాల్లో పాల్గొనవచ్చని సుప్రీం (Supreme Court) అనుమతులు ఇచ్చింది.
బాబు ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, ప్రసంగించకూడదని సీఐడీ (Ap CID) అభ్యర్థించినప్పటికీ దానిని తోసిపుచ్చుతూ సుప్రీం అనుమతులు ఇచ్చింది. దీంతో బాబుకు భారీ ఊరట లభించింది. అలాగే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి మాత్రమే బాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం బాబుకు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వడంతో టీడీపీ (TDP) వర్గాల్లో సంబరాలు నెలకొన్నాయి.
చంద్రబాబు బెయిల్ (Chandrababu Bail) రద్దుకు సంబంధించి గత వారం పిటిషన్ వేసిన ఏపీ సీఐడీ నేడు సుప్రీం కోర్టులో తమ వాదనలు వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ చేపట్టారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు (Supreme Court) ఈ విచారణను డిసెంబర్ 8వ తేదికి వాయిదా వేసింది. చంద్రబాబు ర్యాలీలు, సభలు, రాజకీయ కార్యక్రమాలు చేసుకోవచ్చని వెల్లడించింది.